రాధకృష్ణ కర్రి profile
రాధకృష్ణ కర్రి
34 2 3
Posts Followers Following
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - నా గుండె ఎప్పుడైనా ఒక్కక్షణం ఆగి
మరలా శ్వాసించడం మొదలుపెట్టిందంటే
ఆ ఉచ్ఛ్వాస  నిశ్శ్వాసాలు
నిన్ను చేరాయని.

నీ రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - ప్రతిసారీ నీకు చెప్పుకోలేను
నీ మాటల కోసమే 
ఎదురుచూస్తున్నానని !!!

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - కాలం మారుతూనే ఉంది.
మన మధ్య మాటల 
దూరం కూడా పెరుగుతూనే ఉంది.
బహుశా ఇది కాల ధర్మం 
కానీ 
నా హృదయమే స్వీకరించలేని మర్మం
ఒకటిమాత్రం
తెలీదు ...ఆ కాలానికి
నిన్ను నా నుండి 
ఎంత దూరం జరిపినా
నా ప్రాణం నడిచేది
నీ తలపుల శ్వాసతోనేనని
నీ తలంపు ఆగిన ఆ క్షణమే
నా అంతిమ కాలమని

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - కాలం మారుతునే ఉంది.
మన మధ్య మాటల 
దూరం కూడా పెరుగుతునే ఉంది.
బహుశా ఇది కాల ధర్మం 
కానీ 
నా హృదయమే స్వీకరించలేని మర్మం
ఒకటిమాత్రం
తెలీదు ...ఆ కాలానికి
నిన్ను నా నుండి 
ఎంత దూరం జరిపినా
నా ప్రాణం నడిచేది
నీ తలుపుల శ్వాసతోనేనని
నీ తలంపు ఆగిన ఆ క్షణమే
నా అంతిమ కాలమని

రాధ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - కొన్ని క్షణాలు
 నీకోసం నిలిచిపోతే బాగుణ్ణు
అందులో నేనూ ఓ క్షణాన్నై
నీతో శ్వాసించబడేదాన్ని.

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - మనం చెప్పకుండానే
మన మనసును అర్థం చేసుకోగలిగేదే
నిజమైన బంధం.

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - మనసుకు అందరిని 
సొంతం చేయొద్దు
సొంతం చేసుకున్న వారిని 
ఎలాంటి స్థితిలోను
వదులుకోవద్దు.

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - కాలచక్రం అనే పుస్తకంలో 
మనకోసం కూడా 
ఓ పుట ఉంటుంది.
ఏం రాసుకున్నా 
ఖాళీగా ఉంచుకున్నా
అది మన చేతుల్లోనే.

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - కన్నయ్య...!

నిన్ను తలచుకున్నప్పుడల్లా
అల్లుకోవాల్సిన జ్ఞాపకాల లతలు
ముడుచుకొంటున్నాయి.
అక్కడే
దిగులు పూలు విచ్చుకుంటున్నాయి.

నీ
రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - సహచరా

నీకోసం కాసిన్ని కబుర్లను దోసిట్లో నింపుకొస్తాను
నువ్వేమో నాకు అందకుండా జారుకుంటూ ఉంటావు

నిన్ను పట్టుకోవాలనే ఆతృతలో
నా చేతిని చాచి పరుగెడుతానా
అకస్మాత్తుగా నువ్వు నా చేతికి చిక్కిపోతావు
అంతలో
'ఏవి నువ్వు తెచ్చిన ఊసులు అంటూ
నువ్వు ఆడిగేసరికి'
అప్పుడు చూద్దును... 
అప్పటివరకు ఖాళీగా ఉన్న చేతుల్లో
నీ నవ్వుల చిలకరింపు చల్లిన 
హరివిల్లుల రంగులు
అప్పుడు పుట్టుకొచ్చే సమ్మోహనమైన రంగు 
నీ మోమున...
ఎంత అందంగా అంటే
పాల నురుగులను నింపుకెళ్లే మేఘాలలా
తెల్లగా
నిన్ను చూస్తూ మైమరచిన నాతో
నువ్వు  మళ్ళీ
"నా కోసం తెచ్చిన కబుర్లన్నీ ఎక్కడ" అంటూ
ప్రశ్నిస్తావు.
అదిగో 
ఆ క్షణమే 
తటపటాయిస్తూ
బెదురుచూపులుచూస్తూ
వెతుకుతున్నప్పుడు
నీ కనుల నిండా నిండిన
నా రూపం చెప్పిన ఊసులు కనింపించాయి

నాచేతిని నీ కనులపై ఉంచి
అన్నీ చెప్పేశాను అని నేనంటే
మరి నేను చెప్పొద్దా అంటూ
నా కనులు మూస్తావు
మనసు పరదాల మాటున దాగిన
స్వప్నం చెదిరిపోయింది.
కానీ
కనుల తెరచిన నాకు
నా అరచేతిలో కనిపించింది
నీ సమ్మోహన మోహనరంగు.


రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - జీవితం ఓ మట్టిముద్ద
ఎలా మలచుకున్నా
అది మన చేతుల్లోనే...!!

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - నిన్ను దూరంగా 
ఉంచాననుకున్నా!!
నాకు నేను 
దూరమయ్యానని
తెలుసుకోలేకపోయా!!

రాధ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - గుండెకు నీడలాంటి రంగు
కవచమైంది. 
అది వీడదు
నువ్వు ఎప్పటికీ దానిని 
గుర్తించలేవు.

రాధ - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - సహచర!

నీ మాటల పూదోటలో నేను పొందే పారవశ్యం
గాలిలోని ఆవిరిగా మారినపుడు
చిలుకను విడిచిన గోరువంక గూడులా
నా మానస కన్నీటి అలల ఆక్రందన 
నీ హృదయ తామరాకు మీద నీటి బిందువే
అయినా
నీ ప్రణయహరితంగా మారాలని దాని తాపత్రయం.
బురదలో పడితే రూపమే మారుతుందని తెలిసినా 
ప్రాణాలొడ్డే సాహసమే దానిది

ఎందుకంటే...
నీ సాంగత్యానికి మించిన సంగతులు
ఏమున్నాయి ఈ లోకంలో, చెప్పు??

నీ చూపులు కురిపించే వెండివెన్నెలలో
మళ్ళీ మళ్ళీ మల్లెపూవై
నీ ప్రేమ పరిమళాన్ని పూసుకొని
ముద్దుగా నీ ఎడదమీద ముగ్ధగా ముడుచుకోవాలని,
నువ్ స్పృశించే ఆ క్షణంలో 
మొగలిపూల మత్తు ఆవరించుకున్నదై
నీ సహచరత్వాన్ని అల్లుకుపోవాలని
దాని తాపత్రయం. 

అందుకే 
నీ నేను అనలేని అనర్హురాలిననుకునే
నా పిచ్చి మనసుకు
ఓదార్పు ఆలింగనానివై చేరుకుంటావో!!

లేదా
సందెవెలుగుకు దూరమైన నేలను చేసి
సూరీడులా తప్పుకుంటావో
నీ ఇష్టం మరి...!!!!!

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - కొన్ని పదాలు అనంతార్థాల సంపుటాలు
కొన్ని ఆలోచనలు అఖండ గోదావరీ 
ప్రవాహాలు.

నేనూ ఆ సంపుటిలో ఒక పదాన్నై 
ప్రవాహ దిశగా పయనించాలి...

నువ్వు ఉన్న తీరాన్ని చేరుకోవాలి
నీ రాధనై. - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - కొన్ని పదాలు అనంతార్థాల సంపుటాలు
కొన్ని ఆలోచనలు అఖండ గోదావరీ 
ప్రవాహాలు.

నేనూ ఆ సంపుటిలో ఒక పదాన్నై 
ప్రవాహ దిశగా పయనించాలి...

నువ్వు ఉన్న తీరాన్ని చేరుకోవాలి
నీ రాధనై - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - 
అందరూ వాళ్ళ జీవితం కోసం వాళ్ళు బ్రతుకుతారు
వాళ్ళను ప్రేమించే నువ్వు తప్ప.
కెరటం మన కాళ్ళను మాత్రమే తడుపుతుంది
కానీ, వాళ్ళు మన కళ్ళను, గుండెను రెండింటిని తడుపుతారు భరింతలేని
 దుఃఖపు ధారలతో
రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - ఎవ్వరూ మన కోసం బ్రతకరు.
అందరూ వాళ్ళ జీవితం కోసం వాళ్ళు బ్రతుకుతారు
వాళ్ళను ప్రేమించే నువ్వు తప్ప.
కెరటం మన కాళ్ళను మాత్రమే తడుపుతుంది
కానీ, వాళ్ళు మన కళ్ళను, గుండెను రెండింటిని తడుపుతారు భరింతలేని
 దుఃఖపు ధారలతో
రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - ఎవ్వరూ నీకోసం బ్రతకరు.
అందరూ వాళ్ళ జీవితం కోసం వాళ్ళు బ్రతుకుతారు
వాళ్ళను ప్రేమించే నువ్వు తప్ప.
కెరటం మన కాళ్ళను మాత్రమే తడుపుతుంది
కానీ, వాళ్ళు మన కళ్ళను, గుండెను రెండింటిని తడుపుతారు భరింతలేని
 దుఃఖపు ధారలతో
రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - మనసు: 

ఆ పదం చెవిని తాకేసరికి, నా మనసు ఎందుకో ఉన్నఫళంగా వెచ్చదనం అంటిన మంచుముక్కలా ద్రవించిపోతుంది. 
అందులో ఉన్న నిన్ను తలచుకుంటూ.

ఎదిగిన పసిపాపలా మారిపోతుంది నీ తలంపు తలపులలోకి రాగానే.

ఎక్కడ, ఎప్పుడు, ఎలా తప్పిపోతూ ఉంటుందో
తెలీదు. 
ఒక్క క్షణం నాలోనే ఉన్నట్లుగా ఉంటూ
ఒక్క ఉదుటన అవతలికి దుముకుతుంది
అక్కడేదో తనను విడిచిపెట్టిన చేయి ఆనవాలు ఆవపువ్వులా పచ్చగా కనిపిస్తుందేమో!

ఎంత పరధ్యానంలో ఉన్నా ఆ పదం వినగానే
లయ తప్పిన గానంలా ఆవేదనా రాగం అందుకుంటుంది నీతో గడిపిన వసంతాన్ని అలుముకుంటూ...

కనుదోయికి అడ్డుతెర వేయడం మరచిపోతుంది.
జారే ఆ ప్రవాహంలో తానూ కొంత దూరం ప్రయాణించి 

ఓ చారికను అక్కడ విడిచిపెట్టి వస్తుంది.

మళ్ళీ తిరుగు పయనం అవుతుంది
నీ జాడను వెతుక్కుంటూ. 

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - అలసిపోయాయి కనులు
సొలసిపోయింది మనసు

స్వయంకృతాపరాధానికి
క్షమార్హత లేదంటూ
వసంతం నుంచి శిశిరానికి 
పయనం మొదలంది - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - దూరం దూరమే...
దగ్గరగా ఉన్నట్లు కనిపించే
భూమ్యాకాశాలంత మధ్య దూరమే...
ఎన్నటికీ కలవలేని - కలవని తీరమే!!!

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - నీ తలపులు నన్ను వీడవు
నీ మనసుకు అవి చేరవు

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - వెలుగు పువ్వు


జాడ లేని గాలిలో
నీడనై నిన్ను వెదుకుతున్నాను.

వినిపించే ప్రతి రాగమూ
నీ మాటను భ్రమలో
తేటినై తిరుగుతున్నాను.

నిశీథిలో కాటుకనై కరిగి...

రేపటి వేకువకు
తూరుపు పువ్వునై విచ్చుకోవాలని
నీ కంటి వెలుగునై ప్రభవించాలని.

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - ఎన్నిసార్లు 
కాలపు పుటలను తిరగేసినా
శూన్యమే సమాధానమై ఎదురొస్తోంది
అయినా దానికి తెలీదు
ఎన్ని ఆలోచనలను
నాలోకి మౌనంగా ఒలకబోస్తోందో!!

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - నేనో కాగితపు పువ్వును
లేని, రాని సువాసనలు
అద్దుకోవాలని తపన
.
.

అంటుకోనివ్వని విధిరాత...!!

రాధకృష్ణ - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - // నీ పలకరింత //

రెప్పలమాటు స్వప్నం
కబురుతో వచ్చింది 

పున్నమి వెలుగుల జిలుగులతో
మది నింపి ముద్దబంతిలా విచ్చుకుంది

లేత తలపులు తమకంతో
లతలై అల్లుకుపోతున్నాయి

అరమోడ్పు కన్నులతో
కాటుక కంచెను చేరిపేసి 
విప్పార్చిన చూపుల సారంతో సిద్ధమైంది

రేయి తెచ్చిన చుక్కలు
వెన్నెలను ఒంటికి పూసుకున్నాయి
పారిజాత పరిమాళాలతో అభ్యంగనస్నానం చేస్తున్నాయి.

కప్పురపు పరదాలతో 
కుంకుమపువ్వు సిగ్గులతో
మల్లెలగంధం పూతతో
నీలాకాశపు పందిరి కింద్ర
ఎదురుచూస్తుందో హృదయం
నువ్వు వస్తావనే ఆశతో
ప్రాణం నింపుతావని తనలో
పలకరింపుల నీ శ్వాసతో.

నీ నేను (రాధను)
 - Made using Quotes Creator App, Post Maker App
1 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - అతిగా అతి
విపరీతి

అతి నిజంగానే అతిగా ఉంటుందా!?
ఏమో! దాని గురించి అతిగా ఆలోచించడం కూడా అతేనేమో.
కానీ, కొన్ని సార్లు అతిగా ఆలోచించకపోవడం కూడా అతేనేమో
ఇంత అతిగా ఆలోచిస్తుంటే,
అదేంటి !? అతి అతి చేస్తోంది!

రాధకృష్ణ  - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - శాశ్వత ఝరి
***********

నిత్య ప్రవాహంలా కొట్టుకుపోవడమే
జ్ఞాపకాల వారధి లేదు మరి

ఉన్నదల్లా గుండె కొండల్లో 
పుట్టిన జీవనది ఒక్కటే

ఎలా వచ్చినా ముందుగా 
ప్రవహించి నన్ను చుంబించే
నా చిరకాల నేస్తం అది

నిన్నెప్పుడో దత్తత తీసుకున్నాను
అంటుంది

అవును...
నా తోడు, నీడ, గార్డియన్
అన్నీ తానే అయి 
పొదివి పట్టుకుంది.

అక్షరానికి అక్షరానికి
మధ్య తానో సిరాగా చేరి
అక్షరాలను శుద్ధిచేసి
మాలిన్యాల్ని  కడిగి
మచ్చలేని కాగితాన్ని
ఆ క్షణానికి అందిస్తుంది

కడపటి శ్వాసవరకు
తోడుగా నిలిచే ఓ బంధమైంది

రాధకృష్ణ కర్రి
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
రాధకృష్ణ కర్రి
Quote by రాధకృష్ణ కర్రి - //మధువని//

మన మాటలు 
పూలతల్లా పెనవేసుకున్నాయి
ఒద్దికగా అల్లుకుంటూ
నీ తలపుల పరిమళాలను లేపనం చేసి
నీలో కరిగే మధువును చేశాయి.

ఎందుకంటావు!
నీకు తెలియదా!!

మన ప్రేమ విరితోటలో
విరిసిన మల్లెలు...
మన ఏకాంతపు కౌగిలిలో
కరిగిన వెన్నెలలు...

నీ చూపుల తెమ్మెరలు
తాకిన నా హృదయపు పుప్పొడులు
విచ్చుకున్న విరహ తాపాలు...

ఒక్కటేమిటి

అన్నీ నా చుట్టూ 
మోహనరాగం ఆలపిస్తున్నాయి.
నీ పద రవళిగా చేరి
నన్ను మురిపిస్తున్నాయి...!!

రాధ - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments

Explore more quotes

radha krishna
Quote by radha krishna - //ఎక్కడికని //

కొన్ని పొద్దుల్ని చెరిపేయాలి
కొన్ని రెక్కల్ని కూడగట్టాలి
కొన్ని అక్షరాలను ఒడిసిపట్టాలి
నీకోసం పుట్టే భావాల తుంపరను
నీ మీద కురిపించాలంటే

అక్కర్లేదంటూ
నువ్ తప్పించుకోవాలని చూస్తావేమో
నిన్ను చుట్టుకున్న
నా హృదయపు కాంతి
నిన్ను కదలనివ్వదులే.

అవును
నీ నా అంటూ లేనితనాన్ని 
నాలో నింపిన 
నీవు నన్ను వదిలి
ఎక్కడికని వెళ్లగలవు...!!

కాసింత వెన్నెలను దోసిటపట్టి
నీకై ఎదురుచూసే నా లో నుండి
నీవు ఇంకెక్కడికని వెళ్లగలవు...!!

రాధకృష్ణ కర్రి - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
radha krishna
Quote by radha krishna - కాస్త ఆలస్యమైనా,
వాస్తవంగా మిగిలే 
నిర్మలమైనఆకాశం 
 మనకోసం ఎదురుచూస్తుంది

అవాస్తవమైన మబ్బులు 
కొంత సమయానికైనా
చెల్లాచెదురుకాక తప్పదు.

రాధకృష్ణ కర్రి - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
radha krishna
Quote by radha krishna - సహచర...

నిన్నటి మాటల తోటలో ఓ వలపు రాగాన్నై
నీ కోసం పదనిసల పల్లవులు ఆలపించాను.

కరిగే కాలానికి వెదురునై
నిలువెల్ల గాయాలతో మరో కొత్త గేయాన్నై
నీ ఎదుట నిలిచాను.

అధరాలు పలకలేని పదాలకు కుంచెనై
ఉన్న చిత్రానికి భావాల రంగులద్దాను
నీ మనసు తెలిపే భాషకు భాష్యం కావాలని.

ఇద్దరి నడుమ ఉన్న ఖాళీతనం
విరిగిన శాఖలతో పూడ్చాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న.

అయినా 

పగబట్టిన ప్రేమ పిడిబాకుకంటే 
పదునుగా నా గుండెను చీలుస్తోంది.

ఎంత చెరపలేని వాస్తవమైనా
హృదయఫలకం మీద రాసుకోలేకపోతున్న

కడపటి ప్రాణం వరకూ 
వెన్నలవై చేరుకుంటావని
మల్లెల నవ్వులు పూయిస్తావని
ఎదురుచూపుల కలలను పండిస్తూనే ఉంటా
నీ రాధనై
 - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments
radha krishna
Quote by radha krishna - నీకోసం ఎప్పుడూ 
కొత్త రెక్కకై ఎదురుచూసే పక్షినవుతాను
అప్పుడే ఉదయిస్తుంది మనసులో
ఉన్న నీ గురించిన సన్నని దిగులు.

పొద్దెక్కిన వేడిని తట్టుకోలేక
నీ నీరెండ మాటలకోసం పరితపిస్తుంటాను
అప్పుడే తెలుస్తుంది ఘనీభవించి
ఉన్న నీ అసలు రూపం.

రాధకృష్ణ కర్రి - Made using Quotes Creator App, Post Maker App
0 likes 0 comments